ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,430 పెరిగి రూ.1,19,460కు చేరుకుంది. అంతకుముందు రూ.1,18,030గా ఉంది.



