కర్నూలు: యశోద హాస్పిటల్స్ యమూరాలజీ విభాగం వైద్యులు, కిడ్నీ పనితీరు తగ్గిపోయి, హైడ్రోనెఫ్రోసిస్ (హెచ్డీఎన్)తో పాటు లెఫ్ట్ పెల్వియురేటెరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ (పీయమూజేఓ) అనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నెల వయసున్న మగ శిశువుకు అత్యంత క్లిష్టమైన రోబోటిక్అసిస్టెడ్ పైలోప్లాస్టీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. కిడ్నీ, మూత్రనాళం కలిసే చోట అడ్డంకి ఏర్పడటం వల్ల మూత్రం సరిగ్గా బయటకు రాక, కిడ్నీ వాపుకు గురైన స్థితిలో శిశువును హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దీనివల్ల కిడ్నీ పనితీరు కూడా దెబ్బతింది. సర్జరీకి ముందు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత, నిపుణులైన యమూరాలజీ బృందం జనరల్ అనస్థీషియా ఇచ్చి చిన్నారికి రోబోటిక్ లెఫ్ట్ పైలోప్లాస్టీ సర్జరీని నిర్వహించారు. ఈ మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్ విధానంలో, మూత్రం వ్లె దారిలో అడ్డుపడిన ఇరుకైన భాగాన్ని తొలగించి, డీజే స్టెంట్ పై అత్యంత కచ్చితత్వంతో మూత్రం సాఫీగా బయటకు వ్లెలా దారిని పునర్నిర్మించారు. ఎలాంటి సైడ్ ఎఫెకట్స్ లేకుండా సర్జరీ విజయవంతంగా పూర్తయింది, అలాగే ఆపరేషన్ తర్వాత చిన్నారి చాలా త్వరగా కోలుకున్నాడు. యశోద హాస్పిటల్స్ డాక్టర్. మల్లికార్జున రెడ్డి ఎన్ (సీనియర్ కన్సల్టెంట్ యమూరాలజీ, రోబోటిక్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్) మాట్లాడుతూ, “పుట్టుకతో వచ్చే పీయమూజేఓ అనేది శిశువులలో మూత్ర విసర¨నకు అడ్డంకిగా మారే అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, క్రమంగా కిడ్నీ పనితీరు దెబ్బతింటుంది. చాలా చిన్న వయసు పిల్లల్లో కూడా ఈ రోబోటిక్`అసిస్టెడ్ పైలోప్లాస్టీ సర్జరీ ఎంతో కచ్చితత్వంతో పాటు, చిన్న కోతలు, తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి మరియు త్వరగా కోలుకునేలా చేస్తుంది. ముందస్తుగా వ్యాధిని గుర్తించడం మరియు సకాలంలో చికిత్స అందించడం ద్వారా కిడ్నీ పనితీరును కాపాడవచ్చు, అలాంటి పిల్లలు ఆరోగ్యంగా పెరిగేలా చేయవచ్చు” అని వివరించారు.


