ముకుంద రామారావు సాహితీ సవ్యసాచి, బహుముఖ ప్రజాãశాలి. ఆయన కవన సాహిత్యంలో ‘వలస’ కెంత ప్రాధాన్యం ఉందో, వందల ఏళ్ల క్రితం వలస వెళ్లిన భారతీయుల, అందునా తెలుగువారి వలస వ్యధలకు అంతే ప్రాధాన్యం ఉంది. ఆయన సున్నిత హృదయం ‘వలస వేదన’ లతో ప్రకంపించిందనటంలో సందేహం లేదు. ఆయన వెలువరించిన ‘అగమ్య గమ్యాలు’ పుస్తకం. దీనిలోని వలస ఒప్పంద కార్మికుల వ్యధలు, దీన గాథలు చదువుతుంటే మన హృదయం ఎక్కడో వేదనతో మూలుగుతుంది. ఆయన ‘వలస’ కవిత్వం చదివినప్పుడు కూడా అదే భావన కలిగింది. చదివిన వాళ్లకే ఎంతో వేదన, వికారం కలిగితే నిత్యం ఆ వేదనని అనుభవించే వారి మాటేమిటో తలుచుకొంటేనే భయం వేస్తుంది.
ఇతర విషయాలలోకి పోయేముందు, ముకుంద రామారావు ‘వలస’ కూలీల గురించి మహాత్మా గాంధీ ఏమన్నారో మొట్టమొదటి పేజీలో ఉటంకించారు. అది చదివిన నాకు ఒక క్షణం కళ్లు ఆర్రÝమైనాయి. ప్రతి తెలుగువాడు చదివి తీరవలసిన వాక్యాలవి. ‘ ప్రతి భారతీయుడూ మినహాయింపులేకుండా, యూరోపియన్ల అంచనాల్లో ‘కూలీ’. దుకాణ దారులు ‘కూలీ దుకాణదారులు’. గుమాస్తాలు ‘కూలీ గుమాస్తాలు’. పాఠశాల ఉపాధ్యాయులూ ‘కూలీ ఉపాధ్యాయులు’. భేదం లేకుండా ప్రతి భారతీయుడిని హేయంగా ‘కూలీ’ అంటారు…భారతీయులందరూ వారు ఎవరైనా సరే, కూలీగానే చూడబడుతున్నాడు’మహాత్మాగాంధీ. మహాత్మాగాంధీ చేసిన ఈ వ్యాఖ్యను ముకుంద రామారావు ఎక్కడ దొరకపుచ్చుకొన్నారోగానీ, మహాత్ముని ఈ పరిశీలన నాటికీ, నేటికీ కూడ ఎంత నిజమైందోకదా! ఆఫ్రికా, కర్ఙీయన్ దేశాలకు వలస వెళ్లినవారి మాట అటుంచితే, నేడు అమెరికాకు వెళ్లిన భారతీయులను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ట్రంప్ ఎంతెంత మాటలంటున్నాడో వింటూనే ఉన్నాం గదా. ఆఖరుకు అమెరికాలో పనిచేసే భారతీయులకు అక్కడి బ్యాంకులు రుణాలు మంజూరు చేసేప్పుడు వాళ్ల వీసాలు చెక్చేసి మరీ రుణాలు మంజూరు చేయమని ఒక పాలనా ఉత్తర్వు జారీచేశాడు కొన్ని రోజుల క్రితం. ఇవ్వాళ అమెరికాలోని భారతీయులు భయం, భయంగా జీవితం గడుపుతున్నారక్కడ. ఇక ముకుందరావు రచన ’అగమ్యగమ్యాలు’ మాటకొస్తే, ఇది వలస వెళ్లిన భారతీయుల, తెలుగువాళ్ల కష్ట, నష్టాలు, అవమాన భారాలు గురించి విపులంగా వివరించే గ్రంథరాజం. సరిగ్గా75 సంవత్సరాల క్రితం కొండపి చెంచయ్య అనే ఒంగోలు నుంచి వచ్చిన తెలుగు రచయిత, జర్నలిస్ట్1951 లో ’ఇండియన్స్ఓవర్సీస్ (1951)’ అనే పుస్తకంలో ఇవే విషయాలు విపులీ కరించారు. అప్పట్‌లో ఆయన భారతదేశం నుంచి యునైటెడ్ నేషన్స్‌కు వెళ్లిన తొలి తెలుగు ప్రతినిధి. కానీ, మద్రాస్ విశ్వవిద్యాలయానికి1951లో సమర్పించిన పరిశోధనాగ్రంథంలో కొండపి చెంచయ్య వలస వెళ్లిన భారతీయుల జీవితాలు, వారు ఏఏచట్టాలు, ఒప్పందాల కింద వెళ్లారో నుంచి ఆరంభించి అక్కడికెళ్లిన తరువాత వాళ్లు అనుభవించిన కష్టాలు దేశాల వారీగా వివరించారు. ఈ పరిశోధన 1940-49 వరకూ వలస భారతీయుల సమగ్ర వ్యధల విశ్లేషణ. ఆ తరువాత అంత విస్తృతంగా వలస విధానం తెచ్చిన దు'ఖంపై పరిశోధనాత్మక వివరణ రాసింది ముకుంద రామారావే. సూడాన్, ఇది¸యోపియా, కీన్యా వంటి దేశాలలో పర్యటించారు. నైజర్, నైజీరియా, మాలె వంటి దేశాలలోని ఆర్ధిక, వైద్య, విద్యావిధానాలపై విస్తృత అధ్యయనం చేయడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం నుంచి బ్రిటీష్ వారి తరపున పోరాడడానికి వచ్చి, అశువులు బాసిన భారతీయ సైనికుల సమాధులను ఈ రచయిత అస్మరాలో, కేరెన్లో చూడటం జరిగింది. అస్మరావార్సిమెట్రీలో 16 మంది భారతీయులు, కేరెన్ (అస్మరకు దక్షిణంవైపున్న తూర్పుతీర ఎర్రసముద్ర ప్రాంతం) లో 285 మంది భారతీయసైనికులు, కేరెన్వార్సెమెట్రీలో 73 మంది భారతీయ సైనికుల సమాధులున్నాయి. కన్నీళ్లు తెప్పించే ఆ సంఘటన, అక్కడ వారి స్మృతిలో సరోజినీనాయుడు రాసిన’ ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా’ స్మృత్యంజలి గేయం చదివినప్పుడు ఆ ఆవేదన రెట్టింపయింది. ముకుందరామారావు తన తాత సోదరి ఆఫ్రికాలోనే ఉండిపోయిన సంగతి తెలుసుకొని, ఆమెను తిరిగి దర్శించాలని ఆశపడి ఆరంభించిన ఈ పరిశోధన ’అగమ్యగమ్యాలు’ లాగానే, ఆచార్య అశ్విన్దేశాయ్కి కూడ కొన్ని విచిత్ర ప్రయత్నాలు(పరిశోధనలు) చేశారు. మునిగాడి కుటుంబం (నారాయణస్వామి, ఆమసిగాడు, ముత్యాలుతో సహా నలుగురు) భారతదేశం వచ్చి, తిరిగి ఆఫ్రికా వెళ్లటానికి చేసిన ప్రయత్నాలు ఎంత వంకర తిరిగాయో చెప్పేకథ. దక్షిణాఫ్రికాలోని నటాల్లో జన్మించిన ఒక భారతీయుడు మారిముత్తును ముత్యాలు పెళ్లిచేసుకోవటం కథలో మొదటిభాగం అయితే, మిగతా ముగ్గురు రికార్డుల నుంచి ఎలా మాయమయ్యారో తెలియని విషాదం రెండవభాగం. మూనియన్, ఆయన భార్య తమ కూతురు అయ్యమ్మను మద్రాసులో తన సోదరి దగ్గర విడిచిపెట్టి తిరిగి ఆఫ్రికా వెళ్తారు. కొంతకాలం ఆఫ్రికాలో పనిచేసి డబ్బు సంపాదించుకొని తిరిగి భారతదేశం రావాలని వారి సంకల్పం. ఆఫ్రికా వెళ్లిన వారికి కలిసిరాక అక్కడే ఉండిపోవలసి వస్తుంది. పదేళ్లు అలా గడిచిపోతాయి. తన సోదరి దగ్గర మద్రాస్‌లో ఉన్న అయమ్మకు12ఏళ్ల్లువస్తాయి. ఆమెను తిరిగి ఆఫ్రికా తీసుకెళ్లడానికి వాళ్లు పడ్డపాట్లు తెలిపేది ఈ కథ. ‘చరిత్రను తిరిగి రాయడం, గతాన్ని గుర్తుతెచ్చుకోవడమే కాకుండా, ఈఆఫ్రికా కంఠసీమలో మన జీవితాల భవిష్యత్తు ఊహించుకోవడం అనేది, జీవితాంతం చేసేపనిగా మారింది. ఇది రామారావుకు ప్రేమతో కూడిన శ్రమ కూడ. భౌగోళికంగా చాలాదూరంలో ఉన్నా, చరిత్రకు ఈ జీవితకాల నిబద్ధతపట్ల ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు’ అంటూ ముక్తాయిస్తాడు ఆచార్య అశ్విన్దేశాయ్. ముకుంద రామారావు ప్రస్తుతగ్రంథŠం ’అగమ్యగమ్యాలు’ సాహిత్య పుస్తకంకాదు. ఇదో సామాజిక చారిత్రక పరిశోధనాత్మక రచన. ఇందులో మొదటి అధ్యాయం - ఒప్పంద కార్మిక వ్యవస్థ - నేపథ్యం. తరువాతది ఒప్పంద కార్మిక వ్యవస్థలో బ్రిటీష్ వలస దేశాలు (ఖండాలు). చివరన ఒప్పంద కార్మిక వ్యవస్థ - పరిస్థితులు, బాధ్యులు అనే అధ్యాయానికి అనుబంధంగా ఒప్పంద కార్మికస్త్రీలు, ఒప్పంద కార్మికుల పిల్లలు, చరిత్ర పరిశోధనకు మిగిలిన అడుగుజాడలు వివరించారు. ఈ పుస్తకానికి రాసిన ముందుమాట (నామాట) లో’ ఈ పనిలో నేను ఆనందించిన విషయం ఒకటి తప్పకుండా అందరితో పంచుకోవాలి. 1860-1911ల మధ్య ఒప్పంద కార్మికులుగా దక్షిణాఫ్రికాలోని నటాల్కు వెళ్లినవారిగా నమోదైన1,52,184 మంది సభ్యుల మొత్తం సమాచారాన్ని సేకరించుకోగలిగాను. ఆ వివరాల విశ్లేషణ నా పరిధిలో నేను కొంతమేర చేయగలిగాను. ఇంకా చేస్తున్నాను. వాటిని దక్షిణాఫ్రికాలోని నటాల్మీద రాసిన అధ్యాయంలో చివరన చేర్చాను. నా దగ్గరున్న ఆ దక్షిణాఫ్రికా సమాచారం ఎన్నాళ్లుగానో తమ తాతయ్యల కోసం, మామ్మల కోసం, నాన్నల కోసం, అమ్మల కోసం, అన్నల కోసం, అక్కలకోసం వెతుకుతున్న వారికి కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’ అని ఒక ఆశాదీపాన్ని వెలిగించారు. నిజానికి ఈ పుస్తకంలోని అనేక అధ్యాయాలు విడివిడిగా మన రాష్ట్ర ప్రముఖ దినపత్రికల్లో, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వివిధ, ఆంధ్రజ్యోతి ఎడిట్పేజీలో అచ్చయ్యాయి. మొదట్లో చెప్పినట్లు ఇది సామాజిక పరిశోధక గ్రంథం అయినా దీనికి సాహిత్య ప్రాధాన్యం రావటానికి కారణం ఆయన వలస కార్మికుల గేయాలు, వారి ఉద్యమాలకు ఊతమిచ్చిన గేయాలు, గేయరూపాల్లో వ్యక్తమైన వారి నిరసనలు, వేదనలు, వెతలను కూడ ఈ పుస్తకంలో ప్రచురించారు.
నేటికీ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది. నేటి యువతకు, వారి తల్లిదండ్రులకు స్వాతంత్య్రం ముందు మన భారతీయులు దేశంలో, విదేశంలో అనుభవించిన క్షÃభ తెలియదు. ఈ తరం యువతకు, ప్రజలకు ఇలాంటి గ్రంథాలు చదివితేతప్ప, ‘దేశభక్తి’, ‘అవినీతిరహితపాలన’, ‘పోరాటస్ఫూర్తి’ అనే పదాలకు అర్థం తెలియదు. దేశాల వారీగా ముకుంద రామారావు భారతీయులు ఆయా దేశాల్లో అనుభవించిన చిత్రవిచిత్రమైన మానసిక హింస, శారీరకహింస వివరించారు. అవన్నీ చదివితే మనకు తెలిసేది ఒకటే. ‘ప్రపంచవ్యవసాయ, పారిశ్రామిక సంపదను నిలబెట్టిన శ్రమభారతీయులది. ప్రపంచ ఐశ్వర్యానికి, యూరోపియన్ల పారిశ్రామిక ప్రగతికాదు కారణం. ఆ పరిశ్రమలకు, ముఖ్యంగా నాటి చక్కర పరిశ్రమలకు, పళ్లతోటలకు, ఆహారధాన్యాలకు తమ శ్రమ అందించి వారిని బతికించింది మన భారతీయుల శ్రమనే. ఇది మనదేశ శ్రామికుల గొప్పతనం. ముకుంద రామారావు రాసిన ఈ ’అగమ్యగమ్యాలు’ చదివితే కలిగే స్ఫూర్తి ఇదే. లేకపోతే ’ఎప్పటికీ గమ్యంతోచని గమ్యమే’ మన భవిష్యత్తు.
డా కొప్పరపు నారాయణ మూర్తి, 7671909759


