విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి జెర్మియా, అంగన్వాడీ కార్యకర్త పద్మమ్మ కుమార్తె హారికా కీర్తన అరుదైన పురస్కారం అందుకున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ కెమిస్ట్రీ విభాగంలో పట్టా అందుకున్నారు. హారికా కీర్తన 2022లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టా అందుకున్నారు. ఈ ఘనత సాధించడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.


