విశాలాంధ్ర ధర్మవరం;; రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం అవుతుందని ఏడిఏ లక్ష్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్ డి ఓ కార్యాలయ ప్రాంగణం నందు ప్రకృతి వ్యవసాయం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎండిఎస్ లో భాగంగా విత్తనాలకు పెల్లటైజేషన్ చేయడం పై ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి గారు , సీడ్ డైరెక్టర్ కాటమయ్య గారు మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కు హాజరైన మండల స్థాయి మరియు డివిజన్ స్థాయి అధికారులు ప్రకృతి వ్యవసా పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులను ఉద్దేశించి లక్ష్మనాయక్ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులందరూ ఆచరించవలసిందిగా వారు తెలిపారు. మధ్యాహ్నం గొట్లూరు గ్రామంలో రైతు పోతులయ్య పొలంలో ఆముదము ,అలసందలు, సద్దలు ,మొక్కజొన్నలను పిఎండిఎస్ లో పిలేటి శేనన్ చేసి విత్తడం జరిగింది అని తెలిపారు. ఇందులో భాగంగా విత్తనాలను ఘనజీవామృతంతో శుద్ధిచేసి బంకమన్ను , ఘనజీవామృతం లతో నాలుగు లేదా ఐదు పొరలుగా తయారు చేయడం జరుగుతుంది అని తెలిపారు. చివరిగా బూడిదతో కోటింగ్ చేసి ఆరబెట్టడం జరిగినది అని, ఆరబెట్టిన విత్తనాలను పొలంలో చల్లడం జరుగుతుంది అని తెలిపారు. దీనివల్ల విత్తనం వర్షాలు పడిన వెంటనే నీటిని పీల్చుకొని మనకెత్తుతుంది. దీనివల్ల భూమి వాతావరణంలో పచ్చదనము పెంచడం జరుగుతుంది అని తెలిపారు. నేల కొతకు గురి కాకుండా కాపాడడం జరుగుతుంది. వర్షం నీళ్లు పడిన చోటనే భూమి లోనికి ఇంకుతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముస్తఫా ఏఈఓ అశ్విని విహెచ్ఎ ఆశాజ్యోతి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆదినారాయణ ఉగ్ర నరసింహ పకీరప్ప ఆదినారాయణ బి టి యం ప్రతిభ రైతులు పాల్గొన్నారు.


