ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ పి.రాజాబాబు
సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు శ్రావణి రెడ్డి పలువురు నేతలు
విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : మాలకొండపై యాగశాల వెనుక 5.6 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అంతకుముందుశ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లను దర్శించుకోగా, ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ రెండేళ్లలో మాలకొండ దేవస్థానం అభివృద్ధికి సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. భక్తుల సౌకర్యం కోసం అదనపు వసతి గదులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, కొండపైకి మెట్లమార్గం అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. ఇంకా 1.75 కోట్ల రూపాయలతో అన్న ప్రసాద భవనం అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపకమీషనర్ మరియు ఆలయకార్యనిర్వాహనాధికారి పి.శ్రీనివాసరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, పెగడ శ్రీనివాసులు,కామినేని అశోక్, మేకల అశోక్, కూడలి బాస్కర్,పంది లక్ష్మీనారాయణ,మార్తాల సుబ్బారెడ్డి,మహంకాళి మల్లికార్జున పలువురు నేతలు పాల్గొన్నారు.
The post ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన appeared first on Visalaandhra.


