విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరం..


రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరములను నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ కంటి అంతః నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 16వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు గురువులు విద్యార్థులకు తెలియజేసి వారికి కంటి వెలుగును ప్రసాదించాలని తెలిపారు. ఇప్పటివరకు కళ్ళజోడు వాడుతున్న వారు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేయించుకొని అందుకు అనుగుణంగా కళ్ళజోడు మార్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా కలదు అని తెలిపారు. చదువులో బాగా రాణించాలంటే చక్కటి కంటి చూపు ఎంతో అవసరము అని వారు స్పష్టం చేశారు. అలాగే పాఠశాలలో బోర్డు పైన అక్షరాలు సరిగా కనబడిన వారు కొత్తగా కట్టి పరీక్షలు చేయించుకొని అందులో దృష్టి లోపాన్ని గుర్తిస్తే తప్పనిసరిగా కళ్ళజోడును ఉపయోగించ వలసి వస్తుందని తెలిపారు. ఈ పరీక్షలు పట్టణంలోని ఎస్బిఐ కాలనీలోని మధు కంటి ఆసుపత్రిలో ఉచిత శిబిరమును నిర్వహిస్తారని తెలిపారు. తదుపరి బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ, రోటరీ క్లబ్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి ,నరేందర్ రెడ్డి, జయసింహ, శివయ్య, నాగభూషణ, పెద్దారెడ్డి తో కలిసి శిబిరమునకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *