జూలై 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి


సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం కోర్టులో జూలై 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలతో విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, అడిషనల్ జూనియర్స్ సివిల్ చర్చ్ వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి వెంకటేశ్వర్లు కోర్టు చాంబర్లో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జీలు మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని వారు తెలిపారు. న్యాయవాదుల దగ్గర చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు, రాజీ అయ్యే కేసులను గుర్తించి లోక్ అదాలతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ లోక అదాలతో అధిక కేసులు పరిష్కరించుకునేలా న్యాయవాదులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *