కూటమిలోనే కలకలం.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వంగవీటి రాధ వ్యాఖ్యలు..! Vangaveeti Radha comments spark new debate in AP politics. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

వంగవీటి రాధా, Dadisetti Raja, Jakkampudi Ganeshలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసాయి.

+

ఆఇద్దరికీ

ఆఇద్దరికీ సపోర్ట్ చేయండి వైసీపీ వైపు వంగవీటి రాధా?

ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు వినిపించాయి. కూటమికి మద్దతుగా ఉన్న నేతగా భావించే వంగవీటి రాధ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తన తండ్రి స్వర్గీయ వంగవాటి రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో రాధ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సమీకరణాలపై కొత్త సందేహాలు రేకెత్తించాయి.

గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపం డి.పోలవరం గ్రామంలో మోహనరంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధా, తన తండ్రిని “పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి”గా కొనియాడారు. విజయవాడ పరిసర ప్రాంతానికి చెందిన నాయకుడైనా దేశవ్యాప్తంగా అభిమానులు విగ్రహాలు ఏర్పాటు చేయడం ఆయన ప్రజల గుండెల్లో ఎంత స్థానం సంపాదించుకున్నారో చూపిస్తోందన్నారు. కార్యక్రమంలో Dadisetti Raja, Jakkampudi Ganesh తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

అయితే అసలు రాజకీయ చర్చకు కారణమైనది ఆవిష్కరణ అనంతరం రాధ చేసిన వ్యాఖ్యలే. “మీరు జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాలకు మద్దతు ఇవ్వండి… మీ ఆశీర్వాదమే వారికి బలం” అంటూ ప్రజలను కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం కూటమికి అండగా ఉన్న రాధ, ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకవైపు ఇది కేవలం వ్యక్తిగత అనుబంధమా? లేక సామాజిక వర్గాల పరంగా ఇచ్చిన సందేశమా? లేదా భవిష్యత్ రాజకీయ సమీకరణాల సంకేతమా? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో రాధా మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతుండగా, రాజకీయ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను విభిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. కూటమిలో తనకు ప్రాధాన్యం తగ్గిందనే భావనతోనే ఈ వ్యాఖ్యలా? లేక భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇదే సంకేతమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా, ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చేసిన కొన్ని మాటలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ దిశగా మలుపుతిప్పుతుందో చూడాల్సిందే.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *