గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..


మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం:: గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, ముఖ్య అతిథి న్యాయవాది గుంటప్ప తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలోని సాయి నగర్ లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో 35 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది గుంటప్ప తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల సంస్థ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆందోళనకు కలిగించే టీవీ కార్యక్రమాలు చూడరాదని, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని, సెల్ఫోన్ వాడకం వీలైనంతవరకు పూర్తిగా తగ్గించాలని, మంచి ఆలోచనలతో ఉండాలని తెలిపారు. సుఖ ప్రసవం కొరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ కావాలని తెలిపారు. ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారం తీసుకొని ఆరోగ్యం బాగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ విష్ణువర్ధన్, సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, లయోలా విద్యాసంస్థ అధినేత శంకర్ నాయుడు, సలహాదారు మనోహర్ గుప్తా, ఉపాధ్యక్షులు మంజునాథ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *