విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ


విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ మురళి కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, పాఠశాల విద్వా కమిటీ చైర్మన్ అరవ రామాంజిని, నాయకులు మల్ధకల్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో పాఠశాలలు పునః ప్రారంభం అయిన వెంటనే ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఉపాద్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు . విద్యార్థులు కూడా విద్యలో రాణించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

The post విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *