అమెరికా వైమానిక దాడులు
గల్ఫ్‌లోని లక్ష్యాలపై ఇరాన్ గురి
తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలైంది. శాంతి ఒప్పందం కోసం ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలన్నీ నీరుగారే విధంగా అమెరికా, ఇరాన్ మధ్య బుధవారం భీకర పోరు సాగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఒమర్ తీరం వెంబడి హోర్మూజ్ జల సంధి వద్ద ఆ దేశ సైతం దాడులకు పాల్పడింది. అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం, సిరిక్, జాప్క్ కౌంటీలలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా శక్తిమంతమైన వైమానిక దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ పరిధి ఆ దేశ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ మేరకు ఐఆర్‌జీసీ ఒక ప్రకటన చేసింది. ఖేష్మ్ ద్వీపం సమీపంలో టెలికమ్యూనికేషన్స్ టవర్‌పై, హోర్మూజ్ పరిధిలోని ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసినట్లు వెల్లడించింది. దీంతో బహ్రెయిన్‌లోని 5వ ఫ్లీట్, ప్రాంతీయ ఎయిర్‌బేస్‌లు, హెలికాప్టర్ బేస్‌లపై దాడులు జరిపినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. బహ్రెయిన్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయని, గల్ఫ్‌లో ఉద్రిక్తత పెరిగిందని నివేదికలు వచ్చాయి. యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందిస్తూ ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడం లేదా గాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలిపింది. తమ సైనికులు గాయపడలేదని పేర్కొంది. మరిన్ని ప్రతీకార చర్యలకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. ఇదిలావుంటే అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను హోర్మూజ్ జల సంధి వద్ద కూల్చినట్లు తెహ్రాన్‌పై వాషింగ్టన్ మండిపడింది. ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు బుధవారం ఉదయమే వైమానిక దాడులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్… బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ లక్ష్యంగా ప్రతి దాడులు చేసింది. యుద్ధం ముగించేందుకు ఇప్పటివరకు జరిగిన చర్చలను, దౌత్య ప్రయత్నాలను అమెరికా నీరుగార్చినట్లు విమిర్శించింది. ఇరాన్ తమ దేశంపైకి వదిలిన ఐదు క్షిపణులను గాల్లోనే పేల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. బృందాలుగా ఏర్పడి క్షిపణులను అడ్డుకుంటున్నట్లు తెలిపింది. జోర్డాన్ గగనతలం ఉల్లంఘనకు ఏ దేశానికి అవకాశం ఉండదని సైన్యం తేల్చిచెప్పింది.
The post మళ్లీ యుద్ధం appeared first on Visalaandhra.


