AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. వర్షాగమనం.. ఏపీ, తెలంగాణ రైతులు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు


Last Updated:

AP and Telangana Weather Forecast Update: వర్షాలు ఎప్పుడు పడినా రైతులకు అవి అయితే అనుకూలంగా ఉంటాయి, లేదా సమస్య అవుతాయి. ఇప్పుడు వర్షం పడితే.. అకాల వర్షం అవుతుంది. కానీ ఆ పరిస్థితి వస్తోంది. బంగాళాఖాతంలో తాజా వాతావరణాన్ని తెలుసుకుందాం.

Rapid Read
ఇదిగో అల్పపీడనం.. వర్షాలతో జాగ్రత్త (All Images credit - zoom.earth)
ఇదిగో అల్పపీడనం.. వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth)

వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి ఇన్వెస్ట్ 91B అనే కోడ్ నేమ్ పెట్టారు. అది ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గిరగిరా తిరుగుతోంది. అది శ్రీలంకకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ.. అది క్రమంగా శ్రీలంకవైపు వస్తూ ఉంది. ఈ రోజు రాత్రికి శ్రీలంకను తాకుతుంది. కానీ.. తీరం దాటదు. దిశ మార్చుకొని మళ్లీ రివర్సులో వెళ్తూ.. సముద్రంలోకే వెళ్తుంది. ఆ తర్వాత 22న అది దక్షిణం వైపుగా ప్రయాణించే ఛాన్స్ ఉంది. అంటే.. మన తెలుగు రాష్ట్రాల వైపు రాదు అని అర్థమవుతోంది. అయినా మనకు టెన్షన్ తప్పదు.

ఎక్కడో శ్రీలంకలో అల్పపీడనం ఉంటే.. మనకెందుకు టెన్షన్ అనే డౌట్ రావచ్చు. నిజమే.. ఈ అల్పపీడనం చిన్నదే. బలమైనది కూడా కాదు. వాయుగుండంగా అయ్యే పరిస్థితి కూడా లేదు. అయినా వర్షాలు ఏపీ, తెలంగాణలో పడతాయి. ఎందుకంటే.. ఈ అల్పపీడనం వచ్చిన సమయంలో.. దీని ప్రభావంతోపాటూ.. ఉత్తరాది గాలుల వల్ల ఓ ద్రోణి వాతావరణం ఏపీ, తెలంగాణలో ఏర్పడుతోంది. ఆ ద్రోణికి ఈ అల్పపీడనం కొంత బలాన్ని, చల్లదనాన్ని ఇవ్వబోతోంది. అందువల్ల ఏపీ, తెలంగాణలో 22వ తేదీ ఆదివారం నాడు అక్కడక్కడా జల్లులు పడే ఛాన్స్ ఉంది. అలాగే.. దక్షిణ రాయలసీమలో భారీగా మేఘాలు రావచ్చు. కొన్నిచోట్ల జల్లులు, మోస్తరు వర్షం పడవచ్చు.

వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth)

ఈ వర్షాల వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వారి రోజు వారీ పనులు హాయిగా చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసేవారికి ఈ వర్షాలు బాగా నచ్చుతాయి. ఎందుకంటే.. వీటిలో ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉండవు. జస్ట్ మేఘాలు, చిరు జల్లులే ఉంటాయి. అందువల్ల ప్రయాణాల్లో హాయిగా ఉంటుంది. ఎటొచ్చీ రైతులకే ఇబ్బంది. వారు ఇఫ్పుడిప్పుడే కోతలు కోస్తూ ఉంటారు లేదా పంటలు చేతికి వచ్చే సమయం. ఇలాంటి సమయంలో వాన పడితే.. పంట దెబ్బ తింటుంది. కాబట్టి.. ఈ వర్షాలు పడకపోవడమే మేలు. కానీ.. పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth)

ఫిబ్రవరి 22తోపాటూ.. 23న కూడా వర్షాలు సన్నటి జల్లులా పడే ఛాన్స్ ఉంది. అందివల్ల 21, 22 తేదీల్లో వేడి కొంత తగ్గవచ్చు. ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ నుంచి కొంత తగ్గే ఛాన్స్ ఉంటుంది. చల్లని గాలులు వీస్తాయి. గాలుల వేగం గంటకు 10 నుంచి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. రోడ్లపై టూవీలర్లు నడిపేవారిని గాలి కొంత ఇబ్బంది పెడుతుంది. అయినప్పటికీ హాయిగా ఉంటుంది.

వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth)

ఈ వర్షాలు.. అనారోగ్యాలను పెంచగలవు. అంటే.. జలుబు, దగ్గు, కఫంతో ఇబ్బంది పడేవారు.. ఈ వానల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చలి శరీరానికి తగలకుండా చూసుకోవాలి. జ్వరం ఉంటే.. వెంటనే ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ లాంటిది తీసుకోవడం మేలు. ఎందుకంటే.. ఈ వర్షపు చలి గాలులు.. జ్వరాన్ని త్వరగా పెంచగలవు. అలా జరగకుండా చూసుకోవాలి. పిల్లల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. కేర్ తీసుకుందాం.

వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth)

మొత్తంగా ఈ అల్పపీడనం గురించి, వర్షాల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. రైతులు మాత్రం అప్రమత్తం అయ్యి.. పంట పాడవకుండా చూసుకోవాలి. చేలలో దిగుబడి కాయ ధాన్యాలు ఉంటే.. వాటిని త్వరగా అక్కడి నుంచి తరలించుకోవాలి. ఫిబ్రవరి 24 నుంచి మళ్లీ ఎండలు పెరిగే వాతావరణం ఉండొచ్చు. కాబట్టి.. 22, 23 తేదీలే మనకు కీలకం. ఆ రెండు రోజులూ గడిస్తే.. రైతులకు ఇబ్బందులు తగ్గవచ్చు. చూద్దాం.. వాతావరణ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *