జి.కోటేశ్వరరావు
విజయవాడ ః విద్యారంగంపై ప్రభుత్వం అలావంబిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనంగా విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ లోని దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణం పనులు నిలిచాయి అని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళవాయ సుబ్బరామయ్య హైస్కూల్ పునఃనిర్మాణలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సిపిఐ స్థానిక 38 , 39 డివిజన్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ధర్నాకు హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్య వ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖ దాత, పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను చేరువ చేసేందుకు అనేక దాన ధర్మాలు చేసిన ప్రముఖ ప్రజాహిత వేత్తగా, కళాకారునిగా విశేష గుర్తింపు పొందిన శ్రీ దళవాయి సుబ్బరామయ్య గారి పేరు మీద ఈ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ పాఠశాల స్వాతంత్రానికి పూర్వమే 1930 లో అలనాటి బ్రిటీషు పాలనలో ప్రాధమిక పాఠశాలగా ఏర్పడి, 1970 లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందడం జరిగిందని. రానున్న 2030 నాటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న ఈ పాఠశాల 2022 జులై 1 వ తేదీన ఆనాటి వైసిపి ప్రభుత్వ హయాంలో “నాడు నేడు” పధకంలో నిధిలావస్థలో ఉన్న పాఠశాల పునఃనిర్మాణకి సుమారు 3. కోట్ల15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 20 రూంలతో ఈ పాఠశాల పునఃనిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని. ఆనాడు ఈ పాఠశాలలో స్థానికంగా ఉన్న పేద, మద్యతరగతికి చెందిన సుమారు 660 మంది విద్యార్థులు ఉండగా వారిని తాత్కాలికంగా మైలపల్లి పోలీసు ప్రాథమిక పాఠశాలకు సర్దుబాటు చేయడం జరిగిందని. 2024 లో ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పాఠశాల నిర్యాణం పై నిర్లక్షముగా వ్యవహరించడంతో నేడు విద్యార్థుల సంఖ్య 400 పడిపోవడం జరిగిందని. అంటే సుమారు ముందింట ఒక వంతు విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమైయ్యారని అయన ఎద్దేవా చేసారు. రెండు సంవత్సరాలుగా ఎక్కడి పనులు అక్కడే ఆగి పోయి నిర్మాణం స్తంబించిందని దీనిపై విద్య శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి స్థానిక పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని డిమాండ్ చేసారు. స్థానిక ఎంఎల్ఎ సుజనా చౌదరి ఈ పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ,AIYF నగర అధ్యక్షులు కంచర్ల భార్గవ్, డివిజన్ కార్యదర్శులు కంచర్ల నాగేశ్వరరావు,టి.పూర్ణయ్య, స్థానిక నాయకులు ఎర్రసాని జోసఫ్,అచ్యుత రంగారావు గురజాల కొండలరావు,AVV. కృష్ణ కిషోర్, నారెండి కిషోర్, కోటా రాంబాబు,N.వెంకటేశ్వరరావు, SK. శంషుద్దీన్, మహమ్మద్ అలీ, పి. శ్రీను,K.హుస్సేన్, అండిమాని నాగమణి,డి.దుర్గ, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.


