సూపర్వైజర్ అరుణ
విశాలాంధ్ర ధర్మవరం;;మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు , ప్రాజెక్టు డైరెక్టర్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి సూచనల మేరకు “కిశోరి వికాసం” వేసవి ప్రత్యేక ప్రచారం-2026లో భాగంగా మే 1 నుంచి జూన్ 10 వరకు విజయవంతంగా జరుగుతున్నాయి.
అందులో భాగంగా రావులచెరువు గ్రామం,ధర్మవరం రూరల్ నందు కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం గురించి స్థానిక సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోరుల సాధికారతే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషణ, బాలల రక్షణ చట్టాలపై అవగాహన, ఆర్థిక సాక్షరత, కెరీర్ మార్గదర్శనం, సైబర్ భద్రత, లైఫ్ స్కిల్స్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారని స్థానిక అరుణ సూపర్వైజర్ తెలిపారు.
అందులో భాగంగా బాలల పరిరక్షణ సమితి ఆనంద్ నుంచి వచ్చిన మాట్లాడుతూ ఈరోజున కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు నందు కిషోర్ బాలికలు మరియు తల్లిదండ్రులకు అవగాహన అవగాహన కల్పిస్తూ ప్రస్తుత సమాజంలో పిల్లల పట్ల జరుగుతున్న దాడులు గురించి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి అవగాహన ఉండాలని తెలియజేశారు. కిశోర బాలికలకు, వారి తల్లిదండ్రులకు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అరుణ సూపర్వైజర్, మహిళా పోలీసులు, ఏఎన్ఎం , ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు చంద్రకళ, విజయ, రామాంజనమ్మ , కిషోర్, బాలికలు పాల్గొన్నారు.


