Last Updated:
Dr. B. R. Ambedkar Konaseema జిల్లాలో P. Gannavaram మండలం ముంగాడ గ్రామానికి చెందిన కుడిపూడి కరుణ చెరువులో మృతదేహంగా లభించడం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని Dr. B. R. Ambedkar Konaseema districtలో విషాదం నెలకొంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించిన పదో తరగతి విద్యార్థిని కొద్ది గంటల్లోనే చెరువులో మృతదేహంగా లభించడం కలకలం రేపింది. సీసీ ఫుటేజ్‌లో సైకిల్ తొక్కుతూ జోష్‌గా వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తుండగా, అంతలోనే జలసమాధి కావడం కుటుంబ సభ్యులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. ఏమి జరిగింది? ఎలా జరిగింది? అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
P. Gannavaram మండలం ముంగాడ గ్రామానికి చెందిన కుడిపూడి కరుణ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే ఉదయం స్కూల్‌కి వెళ్లిన ఆమె సాయంత్రం ఇంటికి చేరి, “నానమ్మ ఇంటికి వెళ్లి వస్తాను” అని చెప్పి బయలుదేరింది. అయితే ఆ తర్వాత ఆమె ఇంటికి చేరలేదు. కొంతసేపటి తరువాత చెరువులో ఆమె మృతదేహం కనిపించడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
విద్యార్థిని తండ్రి కుడిపూడి శ్రీనివాస్ అమలాపురంలో ప్రైవేట్ కళాశాలలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి రొయ్యల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన ఈ బాలిక చదువులోనూ, ప్రవర్తనలోనూ చురుకుగా ఉండేదని గ్రామస్థులు చెబుతున్నారు. “మా పాపకి ఎలాంటి సమస్యలు లేవని.. ఎవరిపైనా అనుమానాలు లేవని చెబుతున్నారు. పాపకి ఏం జరిగింది?” అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
సీసీ ఫుటేజ్‌లో కరుణ సైకిల్‌పై వెళ్తూ మధ్యలో చైన్ ఊడిపోవడంతో ఆపి సరిచేసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. గంటన్నర వ్యవధిలోనే ఆమె చెరువులో మృతదేహంగా మారిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరీక్షల ఒత్తిడా? లేక ప్రమాదవశాత్తు జారి పడిందా? లేదా మరేదైనా కారణమా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం పూర్తి కాగా, కొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ ఘటనతో కోనసీమ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ ఆడిపాడే కరుణ ఇకలేదన్న వార్త ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


