నాట్య శిక్షణ కార్యక్రమ ముఖ్య అతిథులు
ముగిసిన వేసవి నాట్య శిక్షణ కార్యక్రమం..
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం వేసవి కాలము యందు వేసవి నాట్య శిక్షణ కార్యక్రమాన్ని గురువు ఆర్ మానస నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని సాంస్కృతిక మండలిలో వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సంకారపు జయ శ్రీ, మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య, హైదరాబాద్ సినీ యాక్టర్ గీత సింగ్, రచయిత అండ్ దర్శకులు తేజోమూర్తుల మురళీధర్, టీవీ అండ్ సినిమా యాక్టర్ హైదరాబాద్ అల్లరి అర్జున్, ఏపీ రంగస్థలం సకలవృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్ది పోగు ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి యాంకర్ గా రాజు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ గురువు మానస అతి చిన్న వయసులోనే చక్కటి చదువును కొనసాగిస్తూ నృత్య కళలో రాణించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అటు అధ్యక్షులుగా ఉంటూ నంది అవార్డు గ్రహీతగా, గిన్నిస్ వరల్డ్ రికార్డుగా, నాట్య మయూరిగా, 2017 లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇన్ కూచిపూడి గా, 2022 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఇన్ కూచిపూడి గా అంచలంచెలుగాఎదగడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం 90 మంది శిక్షణ పొందిన శిష్య బృందంతో నృత్య నీరాజనం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా గురువు మానస నరసింహస్వామి ఆక్ట్ చేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది అని తెలిపారు. తదుపరి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. చివరిగా గురువు మానసలు ముఖ్య అతిథులు చేతులు మీదుగా ఘనంగా సన్మానించారు. మొత్తం మీద ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు గురువు మానసకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
The post ప్రతి ఒక్కరూ అన్ని కళలయందు అభ్యసన ఉండాలి appeared first on Visalaandhra.


