పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం – Visalaandhra


: డీ ఎం.హెచ్.ఓ

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పొగాకు పదార్థాల వినియోగం హానికరం అని డీ ఎం.హెచ్.ఓ. డా. ఈ. బి. దేవి తెలిపారు. ప్రపంచ పొగాకు దినోత్సవ మాసోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొగాకు వినియోగంతో కలిగే అనర్థాలపై ముద్రించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ… పొగాకు వినియోగం వలన నోటి క్యాన్సరు, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభవిస్తాయి అన్నార. ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు,, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధం తెలిపారు,,, 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు పదార్థాలు విక్రయించరాదు అని తెలిపారు, పొగాకు వినియోగం వలన కలగు అనర్థాలను గురించి, ప్రజలకు అవగాహన కల్పించడానికి జూన్ 1 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సోమవారం జరుపుకుంటున్నాము అని తెలియచేసారు. జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు మాట్లాడుతూ పొగ తాగడం వలన అనేక భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయి,, పొగాకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితం గడపాలని తెలిపారు, విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు దుకాణాలను ఉండరాడని ఇన్ఫోర్స్మెంట్ డ్రైవ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు
పొగ తాగే వారి కన్నా పీల్చే వారికే 60% క్యాన్సర్ వచ్చే ప్రమాదమని తెలిపారు.. పొగాకు అలవాటు ఉన్నవారు ఈ వ్యసనాన్ని వెంటనే మానుకోవాలి తెలియజేసారు
ఈ కార్యక్రమంలో , అడిషనల్ డి ఎం హెచ్ ఓ, డాక్టర్ విజయలక్ష్మి,డీపీఎం ఒ , డా. శ్రీనివాసరెడ్డి ఎన్ సి డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విష్ణుమూర్తి,, డెమో నాగరాజులు కంచె లక్ష్మీనారాయణ ,గంగాధర్, జిల్లా పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్త శ్రీరాములు ఎన్ సి డి సిబ్బంది ఆంజనేయులు,ప్రేమ్,కోషోర్, మౌనిక, శశికల, పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *