విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోట పురపాలక పాఠశాల ఆవరణములో జూన్ 14వ తేదీ ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు క్లబ్బు అధ్యక్షులు నాగభూషణం, కార్యదర్శి విజయభాస్కర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరా కరపత్రాలను సాంస్కృతిక మండల కార్యాలయంలో విడుదల చేశామన్నారు. బెంగళూరు శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు, ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. కావున ధర్మవరం పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశానమును వినియోగించుకోవలసినదిగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నరేందర్ రెడ్డి క్యాంపు చైర్మన్ పెద్దారెడ్డి, సత్రశాల ప్రసన్న కుమార్, సుదర్శన్ గుప్తా, రత్నశేఖర్ రెడ్డి, జై సింహా, కొండయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


