Pawam kalyan: గోదావరి పుష్కరాల కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. సెల్‌ఫోన్‌లో స్వయంగా రికార్డ్ చేసిన డిప్యూటీ సీఎం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Pawan kalyan: 2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు.

+

News18

News18

2027 రాజమండ్రి గోదావరి మహా పుష్కరాలు పనులు నేరుగా పరిశీలించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. ఒక హోటల్ ప్రాంతంలో బస చేసిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా గోదావరి ప్రాంతానికి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బోటుపై గోదావరి ప్రాంతాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. గత ఏడాదిగా జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు గోదావరి ఎక్కడ కలుషితం అవుతుంది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించి.. తన వ్యక్తిగత సెల్ ఫోన్‌లో అక్కడి అనేక విషయాలు పవన్ కళ్యాణ్ బంధించారు

గోదావరి తీరంలో పవన్ కళ్యాణ్ రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రాజమండ్రి గోదావరి వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్ చూసేందుకు ఎగబడుతున్నారు. ఈసందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు రాజమండ్రి కలెక్టర్ కీర్తి చేకూరి జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల సైతం పవన్ కళ్యాణ్‌తో ఉన్నారు. ప్రధానంగా దేశం ప్రపంచం అంతా చూసే విధంగా రాజమండ్రి గోదావరి పుష్కరాలు ఏడాది నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల ముందు నుంచి ఈ పనులు ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక సమీక్ష గోదావరిపై ప్రతినిత్యం పెడుతున్నారు, ఇలాంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం నేరుగా గోదావరి పనులు చూసేందుకు అక్కడికి చేరుకున్నారు.

రాజమండ్రి గోదావరికి సంబంధించి పుష్కర్ ఘాట్‌తో పాటు అనేక ఘాట్లు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంటాయి.  ఏడాదిలో అన్ని రోజులు ఈ గాట్లు కలకల్లాడుతూ కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో పుష్కరాల ప్రారంభం అయిన తర్వాత లక్షలాదిగా భక్తులు వచ్చి పుణ్య స్థానాలు ఆచరిస్తారు. ఇలాంటి సమయంలో గత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పెద్ద ఎత్తున పర్యవేక్షణ కొనసాగుతుంది. దీంతో పాటు గంగా అత్యంత స్వచ్ఛంగా ఉండే విధంగా అధికారి యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో పవన్ కళ్యాణ్ సైతం గోదావరి ప్రాంతంలో ఉన్న ఘాట్లు ముఖ్యంగా రైలు కం రోడ్ బ్రిడ్జి అదేవిధంగా రైలు బ్రిడ్జి ప్రాంగణానికి సైతం ప్రత్యేక బోర్డ్ పై చేరుకుని గోదావరి ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

అనేక విషయాల పై పవన్ కళ్యాణ్ దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం అందుతుంది. గోదావరికి సంబంధించి వ్యర్ధాలు చేరుకోవడంతో ఆ వ్యర్ధాలు నిషేధించేందుకు మనం ఏం చేయాలి అన్న విషయం పై పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడ ఉన్న పరిస్థితులను ఆయన వ్యక్తిగత సెల్‌ఫోన్‌లో బంధించారు. అదేవిధంగా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో ఎంతమంది ఈ గాట్లల్లో పుణ్య స్థానాలు ఆచరిస్తారు. మనం ఈ గాట్లు ఎక్స్‌టెన్షన్ ఎంతవరకు చేసాము? ఇంకెంత చేయాలి? ఇలా పలు విషయాలు కూడా అధికారంతో పవన్ కళ్యాణ్ సమీక్ష చేయనున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *