రిషిక ప్రియ చనిపోయింది. నిందితుడు కూడా ఇక లేడు. కానీ సమాజం ఎదుట నిలిచిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. డ్రగ్స్, మత్తు పదార్థాల దుష్ప్రభావం, వ్యవస్థలోని లోపాలు, సమాజంలో పెరుగుతున్న వికృత మనస్తత్వం.. ఇవన్నీ కలిపి ఈ ఘటనను మరింత ఆలోచింపజేస్తున్నాయి. మదనపల్లి విషాదం ఒక కుటుంబాన్ని కాదు, మొత్తం సమాజాన్ని హెచ్చరిస్తోంది. ఇకనైనా మార్పు రావాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



