ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధం


వాషింగ్టన్: అగ్ర రాజ్య అహంకార ధోరణి తగ్గలేదు. శాంతి చర్చలు అంటూ మరో పక్క కయ్యానికి కాలుదువ్వుతునే ఉంది. పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా పెట్టి అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుపుతూ… మరోవైపు ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందనే నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్t శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తోపాటు కీలక అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఇరాన్‌పై తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యక్షుడు వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు విఫలమైతే… వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించే విషయం గురించి వారు మాట్లాడుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి. ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్ అధ్యక్షుడి కార్యక్రమాలకు సంబంధించి కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మెమోరియల్ డే సందర్భంగా న్యూజెర్సీకి వెళ్లాలని ట్రంప్ తొలుత నిర్ణయించుకున్నారు. అయితే, దాన్ని రద్దు చేసుకున్న ఆయన వైట్‌హౌస్‌లోనే ఉండనున్నారు. ఇక, అమెరికాకు చెందిన పలువురు సైనిక, నిఘా అధికారులు కూడా తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా…ట్రంప్ తన కుమారుడు డొనాల్డ్ ప్రంప్ జూనియర్ వివాహానికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లోనే ఉండిపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *