మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…


జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన
విశాలాంధ్ర ధర్మవరం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, మహిళా కేసుల దర్యాప్తులో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా తప్పక వ్యవహరించాలని వారు తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. సమావేశంలో కేసుల పెండింగ్ విచారణ దశలో ఉన్న కేసుల పురోగతి, ఫోక్సో కేసులు, మహిళా సంబంధిత నేరాలు, గ్రేవ్ నాన్ గ్రేవ్ గంజాయి కేసుల దర్యాప్తు, వంటి వాటిపై స్టేషన్ల వారీగా సమీక్షించారు. డ్రోన్ల ద్వారా నిఘా, రౌడీ షీటర్లు , పాత నేరస్తుల కదలికలపై పర్యవేక్షణ, రోడ్డు భద్రత చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తదితర అంశాలపై
విచారణలో ఉన్న కేసులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంబంధిత నేరాలు, ఫోక్సో కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలతో దర్యాప్తు నిర్వహించి నిర్దిష్ట గడువులోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.మహిళా, చిన్నారులపై జరిగే నేరాల్లో నిందితులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని తెలిపారు.సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు, సిఐ లు రెడ్డప్ప నాగేంద్రప్రసాద్, ప్రభాకర్ మహమ్మద్ అలీ, సునీత , శివ రాముడు, ఎస్సైలు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *