రూ.14.74 కోట్లతో కొత్త వసతి గదులు.. కాణిపాకంలో భక్తులకు సూపర్ సదుపాయాలు..! kanipakam vinayakasadan new buildings inauguration boost for temples. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మంత్రి Anam Ramanarayana Reddy ప్రత్యేక పూజలు, వినాయకసదన్ 108 గదుల అకామిడేషన్ ప్రారంభం, 106 ఈవో పోస్టుల భర్తీ ప్రకటన

+

News18

News18

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి Anam Ramanarayana Reddy స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి రాక సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అతిథి గృహం వద్ద చిత్తూరు జిల్లా కలెక్టర్ Sumit Kumar స్వాగతం పలకగా, ఆలయ చైర్మన్ సురేంద్రబాబు, ఈవో పెంచల్ కిషోర్, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం అందించారు.

ప్రత్యేక దర్శనం అనంతరం స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం చేశారు. అనంతరం వినాయకసదన్ అతిథి గృహంలో నూతనంగా నిర్మించిన రెండు, మూడు అంతస్తుల భవనాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో Murali Mohan, Gurajala Jagan Mohan తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భక్తులకు మరింత మెరుగైన వసతి కల్పించే ఉద్దేశంతో రూ.14.74 కోట్ల వ్యయంతో నిర్మించిన వినాయకసదన్ అకామిడేషన్ బిల్డింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నూతన బ్లాకుల్లో మొత్తం 108 గదులను ఆధునిక సౌకర్యాలతో సిద్ధం చేశారు. అదనంగా రూ.2.10 కోట్లతో టేక్ వుడ్ పడకలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్, అత్యాధునిక ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో స్వామివారి ఫోటో ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీన్ని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో త్వరలో గోదావరి, కృష్ణ పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అర్ధగిరి, మొగిలి ఆలయాలను టూరిస్ట్ హబ్‌లుగా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అలాగే కాణిపాకం ఆలయాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేయడంతో పాటు అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధికి అపోలో దాతల సహకారంతో త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇదే సమయంలో నిరుద్యోగులకు కూడా మంత్రి తీపికబురు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహించి భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాల పెంపుపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దీంతో భక్తులతో పాటు నిరుద్యోగుల్లోనూ ఈ ప్రకటనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *