వైశాఖ బ్రహ్మోత్సవాలు, మాఘ తెప్పోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలు, గరుడసేవ, పూలంగి సేవ వంటి ఉత్సవాలు ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులకు ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలు అందించడంతో పాటు పుష్కరిణి వద్ద భక్తి సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోంది. రామాయణం, మహాభారతం, భాగవత ఘట్టాలతో వెలసిన ఈ దివ్యక్షేత్రం తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.



