Vizag Expo 2026: వైజాగ్ ఎక్స్పో కిర్రాక్.. బీచ్ రోడ్డులో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ చూసి పిల్లలు ఫిదా | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Vizag Expo 2026: విశాఖపట్నంలో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో సమ్మర్ లో చిన్నారులను అలరిస్తోంది.

+

Vizag

Vizag Expo 2026

Vizag Expo 2026: విశాఖపట్నంలో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో సమ్మర్ లో చిన్నారులను అలరించేందుకు, ఆకట్టుకునేందుకు రోబోలు రోబోట్ యానిమల్స్ ఏర్పాటు చేశారు.  వేసవి సెలవుల్లో నగర ప్రజలు సరదాగా గడిపేందుకు ఎగ్జిబిషన్లో రోబోలు , రోబోటిక్ అనిమల్స్ పెట్టడం జరిగిందని నిర్వాకులు రాజారెడ్డి అంటున్నారు. ఈ రోబోటిక్స్ అనిమల్స్ కదులుతూ చిన్నారులతో ఎంతో సరదాగా ఉంటాయని అన్నారు.

బీచ్‌లో రోబోటిక్ యానిమల్స్..

సినిమాలో చూసా రోబోలు బయట కనిపించడంతో సరదాగా గడిపేందుకు ఎంతో బాగుంటుందని తెలిపారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గరలో పర్యటకులకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖలో ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు. డాగ్ రోబో , హ్యూమనేడ్ రోబో కదులుతూ వచ్చే పర్యటకలను ఆహ్వానిస్తాయని తెలిపారు. వాడితో సరదాగా కాసేపు గడపచ్చని అన్నారు. ఒకసారిగా బయట రోబోలు కనిపించడంతో ఎంతో సరదాగా గడుపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

సాయంత్రం అయితే సందడే..

ఈ వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ కోసం దీనిని అంటుబాటులో ఉంచ‌డం జ‌రుగుతుంద‌న్నారు. క‌దిలే చిత్రాల‌తో పాటు మ‌నం కూడా క‌దులుతున్నామ‌నే భావ‌న క‌లిగించే విధంగా  వ‌ర్చువ‌ల్ డూమ్ , ఒకవైపు యమలోకం, డైనో పార్క్, వివిధ రకాల ఎమ్యూజ్మేంట్ రైడ్స్, షాపింగ్ ,ఫుడ్ స్టాల్స్ తో  పాటు ఎక్సక్లూజివ్  వ‌ర్చువ‌ల్ డూమ్‌ను బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా  పేరుగాంచిన విశాఖ కు పరిచయం చెయ్యడం బిగ్ డ్రీమ్ అన్నారు నిర్వాహకులు రాజారెడ్డి. విశాఖ వాసులు ఎల్లప్పుడూ కొత్త‌ద‌నాన్ని స్వాగ‌తించ‌డంతో  మంచిగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఆట కొత్త కొత్త మోడల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని దీనిలో భాగంగానే ఈ ఏడాది ఈ రోబోటిక్స్ పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ వచ్చి వీక్షించాలని సందర్భంగా తెలిపారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *