Last Updated:
Elephants: తిరుమలలో తరచూ ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అడవుల్లోకి పంపేందుకు.. కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగుల్ని తెప్పించింది. ఆ ఏనుగుల ద్వారా కొంతవరకూ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.
తిరుపతి జిల్లా.. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఏనుగులు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఏనుగుల గుంపు ద్విచక్ర వాహనదారుడిని వెంటాడటంతో అతడు ప్రాణాలతో తృటిలో తప్పించుకుని అటవీ శాఖకు సమాచారం ఇచ్చాడు.
ఇది తెలిసి అటవీ సిబ్బంది గంటలకొద్దీ శ్రమించి ఏనుగులను అడవిలోకి మళ్లించారు. ఈ ఘటన కారణంగా రోడ్డుపై వాహనాలు 3 గంటలకు పైగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏనుగులు వెళ్లిన తర్వాతే రాకపోకలు సాఫీగా పునరుద్ధరించారు.
ఇలా తిరుమలలో తరచూ ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని అడవుల్లోకి పంపేందుకు.. కర్ణాటక నుంచి ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగుల్ని తెప్పించింది. ఆ ఏనుగుల ద్వారా కొంతవరకూ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఐతే.. అడవుల సంఖ్య తగ్గిపోతుండటం వల్ల.. ఏనుగులు తరచూ.. జనావాసాల వైపు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



