భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం.. మే 20, 21 తేదీల్లో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అలాగే.. మే 19న రాయలసీమ, తీర ప్రాంత ఏపీ, యానాంలో తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. మత్స్యకారులు.. మే 18 నుంచి 22 వరకూ బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దు అని IMD అధికారులు హెచ్చరించారు.



