ఆదివారం, సోమవారం, మంగళవారం తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. వర్షం పడినప్పుడు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయనీ.. ఈదురు గాలుల వేగం గంటకు 30 నంచి 40 కిలోమీటర్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ పేటలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రభ రిపోర్ట్ చేసింది. శనివారం నైరుతీ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకాయి. అలాగే.. అగ్నేయ అరేబియా సముద్రం, అగ్నేయ బంగాళాఖాతాన్ని చేరాయి.



