మాజీ ఎంపీపీ దివంగత తోరాటి కి ఘన నివాళి


విశాలాంధ్ర – కడియం : మండల అధ్యక్షుడిగా, సర్పంచిగా కడియం మండల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మాజీ ఎంపీపీ దివంగత తోరాటి సత్యనారాయణ 10వ వర్ధంతి వేడుకలు శుక్రవారం కడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత తోరాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. కడియం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పలువురు పేర్కొన్నారు. తోరాటితో ఉన్న అనుబంధాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొత్తూరి కృష్ణమూర్తి, తోరాటి వసంతరావు, తోరాటి శ్రీను, అడపా సుబ్రహ్మణ్యం, చిలుకూరి రామకృష్ణ, తుమ్మా రాజు, మురమళ్ల వీరబద్రాచార్యులు, చిట్టూరి ఏడుకొండలు, సాలెడ్రం ముత్యాల రావు, ఖండవిల్లి రామారావు, బొర్ర రామకృష్ణ, నరుకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *