రాష్ట్రపతి సమక్షంలో 72 యుద్ధ నౌకల పరేడ్.. విశాఖలో హిస్టారిక్ ఈవెంట్..! INS Vikrant power demonstration in Visakhapatnam in 2026. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో INS విక్రాంత్, INS సుమేధా, ద్రౌపది ముర్ము, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 
భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో ఎదుగుతోంది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 

సముద్ర తీర నగరం విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయి నౌకాదళ వైభవానికి వేదికగా మారింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 సందర్భంగా ప్రపంచ దేశాల నౌకాదళాలు, ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మరైన్లు ఒకేచోట చేరి అద్భుత దృశ్యాన్ని సృష్టించాయి. ఈ భారీ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. సముద్ర భద్రత, అంతర్జాతీయ భాగస్వామ్యం, భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేడుకగా ఇది నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి మరియు సాయుధ దళాల సర్వసైన్యాధిపతి ద్రౌపది ముర్ము హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెతో కలిసి INS సుమేధా నౌకపై ప్రయాణిస్తూ యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి పాల్గొన్నారు. మొత్తం 72 ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మరైన్లు సముద్రంపై శక్తి ప్రదర్శన చేశాయి.

“యునైటెడ్ త్రూ ఓషన్స్” అనే థీమ్‌తో నిర్వహించిన ఈ ఫ్లీట్ రివ్యూ, భారత్ సముద్ర శక్తి పెరుగుదలను మరియు ప్రపంచ దేశాలతో బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలను ప్రతిబింబించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్ పాల్గొనడం గర్వకారణమని అన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ప్రతీకగా నిలిచిందని, రక్షణ రంగంలో స్వదేశీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిందని వివరించారు.

అంతర్జాతీయ నావికాదళాల భాగస్వామ్యం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, పరస్పర సహకారం పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టం చేసిందని తెలిపారు. భారత నౌకాదళం గ్లోబల్ స్థాయిలో వేగంగా ఎదుగుతోందని, ఆధునిక సాంకేతికత, వ్యూహాత్మక శక్తితో ముందుకు సాగుతోందని అన్నారు. ఆరు వరుసల సముద్ర విన్యాసాలు, గగనతల ప్రదర్శనలు, సమన్వయ కదలికలు ప్రేక్షకులను అలరించాయని చెప్పారు. విశాఖలో ఈ స్థాయి అంతర్జాతీయ కార్యక్రమం జరగడం దేశానికి శుభసూచకమని, సముద్ర రక్షణలో భారత్ కొత్త అధ్యాయాన్ని రాస్తోందని పేర్కొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *