భక్తుల కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతీ గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ వంటి వసతి కేంద్రాలను టీటీడీ నిర్వహిస్తోంది. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఏసీ గదులను ఆన్‌లైన్ మరియు రొటేషన్ విధానంలో కేటాయిస్తుండగా, నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అందిస్తున్నారు.



