Last Updated:
AP VRO Corruption: ఆయన. పేరుకు మాత్రమే వీఆర్వో, కానీ ఆయన పరపతి ఆర్డీవోని మించి ఉంటుంది. పెన్ను పెంటాలన్న లంచమే, ఏపని చేయాలన్నా లంచమే. అది కూడా వేలు, వందలు కాదు లక్షల్లో చేతులు తడిపితేనే ఆయన దగ్గర పని జరుగుతుంది. కేవలం పాస్ పుస్తకాలకు సంబంధించి పది లక్షల రూపాయలు డిమాండ్ చేశాడో అధికారి.
AP VRO Corruption: ఆయన. పేరుకు మాత్రమే వీఆర్వో, కానీ ఆయన పరపతి ఆర్డీవోని మించి ఉంటుంది. పెన్ను పెంటాలన్న లంచమే, ఏపని చేయాలన్నా లంచమే. అది కూడా వేలు, వందలు కాదు లక్షల్లో చేతులు తడిపితేనే ఆయన దగ్గర పని జరుగుతుంది. కేవలం పాస్ పుస్తకాలకు సంబంధించి పది లక్షల రూపాయలు డిమాండ్ చేసి రూ. 1,50,000 అడ్వాన్స్ తీసుకుంటూ ఉండగా వీఆర్వో బాగోతం ఏసిపి అధికారులు బయటపెట్టారు. ప్రభుత్వాధికారులతో పని చేయించుకోవడం మన హక్కు, లంచాలు ఇచ్చి కాదు, ఒకవేళ లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే మమ్మల్ని సంప్రదించండి అంటూ ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. నిజానికి విఆర్వో కదా అని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఏసిబి అధికారులకు సైతం ఖంగుతినే విషయాలు దర్యాప్తులో బయటపడ్డాయి. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకారావుపేట నియోజకవర్గంలోనే ఈ అవినీతి తిమింగలం బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం అది. ఈ నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం పెద్దతీనార్ల వీఆర్వో గా చిట్టిబాబు నక్కపల్లి రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఒక రైతు తనకి పాస్ పుస్తకాలు ఇప్పించాలని ఆ ప్రాంత వీఆర్వో అయిన చిట్టిబాబు చుట్టూ అనేకసార్లు తిరిగారు. రెండు సంవత్సరాలకు పైగా కాలం గడిచింది. కానీ పాస్ పుస్తకాలు పనికాలేదు ఇటీవలే ప్రభుత్వం సర్వే నిర్వహించిన నేపథ్యంలో ఇతను 5 ఎకరాల పొలానికి సంబంధించి రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో ఇదే విషయాన్ని క్యాస్ చేసుకునేందుకు ప్రత్యేక పన్నాగం పన్నాడు. ఈ అవినీతి వీఆర్వో చిట్టిబాబు. పని జరగాలంటే పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటూ బాధితులను ఎరవేశాడు.
భూమి పట్టాదారు పుస్తకం కోసం రైతును రూ. 10 లక్షలు డిమాండ్ చేయడంతో రూ.1, 50, 000 అడ్వాన్సుగా చెల్లించాలని అది ఇక్కడ కాదు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ ప్రాంతంలోకి వచ్చి ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు అక్కడికి వచ్చి 1లక్ష 50 వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే అంతకుముందే ఏసీబీ అధికారులకు ఈ విషయాలన్నీ బాధితుడు ఫిర్యాదు రూపంలో చెప్పడంతో వాళ్లు కూడా అతడ్ని ఫాలో అయ్యారు. సరిగ్గా డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు వీఆర్వో చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు.
లక్షన్నర డబ్బు అవినీతి తీసుకుంటూ చిక్కిన వీఆర్వోని అంతటితో వదిలిపెట్టకుండా అక్కడి నుంచి నక్కపల్లి ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకుని సోదాలు నిర్వహించారు. దీంతో విఆర్ఓ చిట్టిబాబు లంచాల బాగోతం మరింత తెలియడంతో ఆయన నివాసంలో సైతం శోధాలు ప్రారంభించారు. తదుపరి ఇన్వెస్టిగేషన్ అనంతరం మరిన్ని వివరాలు తెలుపుతామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాధికారులతో పనులు చేయించుకోవాలంటే లంచాలు ఇవ్వడం సరికాదని,ఒకవేళ లంచాలు కావాలని ఎలాంటి అధికారి డిమాండ్ చేసిన ఎసిబి అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
May 13, 2026 10:28 AM IST


