Summer Crime Alert: దాహం అవుతోంది మంచినీళ్లు ఇవ్వమని అడిగి.. ఎంపీపీకే షాక్ ఇచ్చిన ఆగంతకులు |


Last Updated:

Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చోరీలు చేసేందుకు దొంగలు వేసే ఎత్తుగడలు చాలా విచిత్రంగా, వింతగా ఉంటున్నాయి. కనీసం ఆలోచనకు కూడా తట్టనంలా ఉంటున్నాయి. ఆకలి, దాహం పేరుతో ఇళ్లు, ఆఫీసుల దగ్గరకు చేరుకొని అక్కడున్న భౌతిక, స్థానిక పరిస్థితులను పరిశీలించి తమకు అనుకూలంగా మార్చుకొని చోరీలు చేస్తున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.

summer crime alert
summer crime alert

Summer Crime Alert: ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చోరీలు చేసేందుకు దొంగలు వేసే ఎత్తుగడలు చాలా విచిత్రంగా, వింతగా ఉంటున్నాయి. కనీసం ఆలోచనకు కూడా తట్టనంలా ఉంటున్నాయి. ఆకలి, దాహం పేరుతో ఇళ్లు, ఆఫీసుల దగ్గరకు చేరుకొని అక్కడున్న భౌతిక, స్థానిక పరిస్థితులను పరిశీలించి తమకు అనుకూలంగా మార్చుకొని చోరీలు చేస్తున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. ఎదుటికి వాళ్లకు సహాయం చేస్తున్నామనే భ్రమలో బాధితులు ఉండగానే దొంగలు చాకచక్యంగా తమ పని కానిచ్చేస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ఎంపీపీ మెడలో నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. మహిళ ప్రజా ప్రతినిధిని పుణ్యం దక్కుతుందని భావిస్తే దొంగలు పాపాన్ని మూటగట్టుకెళ్లారు. అసలు ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటో మీరే చూడండి.

మంచినీళ్లడిగి ..

ఎండాకాలం కావడంతో గోదావరి జిల్లాలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ జిల్లాలో ఈ దొంగతనాల సంఖ్య కాస్త అధికంగా ఉంది. ఈ మధ్యకాలంలో కాకినాడ జిల్లాలో తాళం వేసిన నివాసాలను టార్గెట్ చేస్తూ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కోనసీమలో మాత్రం అందుకు భిన్నంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ితాజాగా సోమవారం ఉదయం పట్ట పగలు ఒక ప్రజా ప్రతినిధిని మాయమాటల్లో పెట్టి మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పారిపోయిన వార్త స్థానికంగా సంచలనం రేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పోన్నమండ ఈ ఘటన చోటుచేసుకుంది. రాజోలు ఎంపీపీగా ఉన్న కడలి శ్రీదుర్గ ఇంటి పరిసర ప్రాంతానికి ఒక గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి, దాహంగా ఉంది, నీరు కావాలని అడిగాడు. పాపం కదా అని దాహం తీర్చేందుకు లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చి సదరు దొంగకు ఇచ్చే క్రమంలోనే నీళ్లు తీసుకుంటూనే మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చేత్తో బలంగా లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు దుండగుడు.

ఎంపీపీ మెడలో నగలు మాయం..

సాక్షాత్తు ఓ ప్రజాప్రతినిధి అందులో మహిళకు పట్టపగలే దుండగుడు ఊహించని షాక్ ఇవ్వడంతో వెంటనే తేరుకున్న మహిళా ఎంపీపీ కడలి శ్రీ దుర్గ తన ఇంటికి వచ్చింది దాహంతో ఉన్న వ్యక్తి కాదని చైన్ స్నాచర్‌ అని తెలుసుకుంది. గట్టిగా కేకలు వేసినప్పటికి ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ దుండగుడు అక్కడి నుంచి పరిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

ఈ జాగ్రత్తలు తప్పని సరి..

ఈ దోపిడీ తర్వాత పోలీసులు స్థానికులకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దని.. ఇళ్లలోకి పిలవడం, మర్యాదలు చేయడమే కాదు ఒంటరిగా ఉండే వ్యక్తులు, మహిళలు చివరకు సహాయం చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. ఇక టూ లెట్ బోర్డులు పెట్టుకున్న ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ల కదలికలను పసిగట్టి లోపలికి రానివ్వడం, లేదంటే పోలీసులకు తగిన సమాచారం ఇవ్వడం చేయాలని చెప్పారు. కాబట్టి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడినప్పుడు ఒక్కరిగా దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *