టేకాఫ్‌ సమయంలో భయానక ఘటన.. ఇంజిన్‌లోకి వ్యక్తిని లాక్కొన్న విమానం..


అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. డెన్వర్‌లోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్రాంటియర్ ఎయిర్‌లన్స్ విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రన్‌వే దాటుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా భద్రతా కంచెను దూకి విమానానికి అత్యంత సమీపంగా చేరుకున్నాడు. అదే సమయంలో టేకాఫ్‌ కోసం వేగం పెంచుతున్న ఎయిర్‌బస్ A321 విమానం ఇంజిన్‌ అతడిని ఒక్కసారిగా లోపలకు లాగేసుకుంది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి శరీరం పైభాగం ఇంజిన్‌లో ఇరుక్కుపోవడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. అనంతరం ఇంజిన్‌ నుంచి భారీగా మంటలు వెలువడ్డాయి.

గంటకు 139 మైళ్ల వేగం
సమాచారం ప్రకారం, ఘటన జరిగిన సమయంలో విమానం సుమారు గంటకు 139 మైళ్ల వేగంతో టేకాఫ్‌ దశలో ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇంజిన్‌లో మనిషి కాళ్లు కనిపించడంతో పాటు పెద్ద శబ్దాలు, మంటలు వెలువడటంతో విమానంలో కలకలం రేగింది. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేసి అత్యవసర చర్యలు చేపట్టారు.
అనంతరం విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *