Last Updated:
Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది.
Road Safety Awareness: చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుంది”, “No Helmet – No Petrol” మరియు “No Helmet – No Ride” వంటి బలమైన నినాదాలతో ప్రజల్లో బాధ్యతాయుత డ్రైవింగ్‌పై చైతన్యం పెంచడానికి జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీసు యూనిట్ ట్రాఫిక్ విభాగం, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, బీట్ కానిస్టేబుళ్లు ప్రజల మధ్య నేరుగా వెళ్లి హెల్మెట్ ఒక రక్షణ కవచమని తెలియజేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రాణనష్టం నివారణకు హెల్మెట్టు సరియైన రీతిలో ధరించడం ఎంత ముఖ్యమో నిజ జీవన ఉదాహరణలతో వివరించి, యువతలో మరింత బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను పెంపొందించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు.
జరిమానా తప్పించుకోవడానికి కాదు, తమ కుటుంబాల కోసం, తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే సందేశం పోలీసు శాఖ నిరంతరం ప్రచారం చేస్తోంది. అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుండడంతో, వేగ పరిమితులను పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు నియమాలను గౌరవించడం వంటి శృతిపాట్లు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో అమలవుతున్న “No Helmet – No Petrol” నిబంధన ప్రకారం హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వరాదని కఠినంగా అమలు చేస్తుండగా, No Helmet – No Ride కార్యక్రమం ద్వారా ఎంత చిన్న దూరమైనా హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ఈ రెండు కార్యక్రమాల లక్ష్యం హెల్మెట్‌ను ఒక అలవాటుగా మార్చడం, ప్రతిరోజూ ప్రాణరక్షణ పద్ధతిగా ప్రజల జీవనశైలిలో భాగంగా నిలిపేయడమే. వాహనాన్ని నడిపే వ్యక్తి మాత్రమే కాదు, వెనుక కూర్చునే ప్రయాణికుడు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అంశాన్ని పోలీసులు గట్టిగా గుర్తుచేస్తున్నారు.
తిరుపతి జిల్లా పోలీసులు ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తూ, రోడ్డు భద్రత అనేది వ్యక్తిగతం మాత్రమే కాకుండా, కుటుంబ మరియు సమాజ భద్రతతో కూడిన బాధ్యత అని చెబుతున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం అమూల్యమైన ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదానికి దారి తీస్తుందని, రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మన జీవితాన్ని, ఇతరుల జీవితాలను కూడా రక్షించవచ్చని తెలిపారు.ప్రజలు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకుని, రోడ్డు భద్రత పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రమాదాల రహిత తిరుపతి జిల్లాను నిర్మించవచ్చని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh


