Earthquake: ఒంగోలులో భూకంపం.. కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి.. పరుగులు పెట్టిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఐతే.. ఈ భూకంపంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది స్వల్ప భూకంపమే కాబట్టి.. ఎలాంటి సమస్యలూ రాలేదని తెలిసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Earthquake: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి భూకంప ప్రకంపనలు సంభవించాయి. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై, ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. 2 సెకండ్ల పాటూ భూమి కంపించింది. శర్మకాలేజీ, సీతారాంపురంలో ప్రకంపనలు వచ్చాయి. అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఐతే.. ఈ భూకంపంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది స్వల్ప భూకంపమే కాబట్టి.. ఎలాంటి సమస్యలూ రాలేదని తెలిసింది.

శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1:45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. శ్రీరామపురం కాలనీ, సీఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా కంపించిన భూమి.

ప్రజల భయాందోళనలు

ప్రకంపనల సమయంలో ఇళ్లలోని మంచాలు కదలడం, వంటింట్లోని పాత్రలు కింద పడటంతో ప్రజలు ఉలిక్కిపడి లేచారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో చాలా చోట్ల ప్రజలు రాత్రంతా రోడ్లపైనే గడిపారు (జాగరణ చేశారు). తెల్లవారుజాము వరకు మళ్లీ ఎలాంటి ప్రకంపనలు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నష్టం వివరాలు

అదృష్టవశాత్తూ ఈ ప్రకంపనల వల్ల ఎక్కడా ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. అయితే, గతంలో ఏప్రిల్ 4వ తేదీన కూడా ఒంగోలు సమీపంలో 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

గతేడాది కూడా ప్రకంపనలు

ప్రకాశం జిల్లాలో గతేడాది సరిగ్గా మే నెలలో భూప్రకంపనలు వచ్చాయి. మే 5వ తేదీన వచ్చాయి. ఆ సమయంలో జిల్లాలోని దర్శి, పొదిలి, కురిచేడు, ముండ్లమూరులో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో భయంతో ఇండ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. గత ఏడాది సైతం ప్రకాశం జిల్లాలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులో భూమి కంపించింది. మే 5 సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *