కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ వచ్చే 4 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లో వచ్చే 5 రోజులపాటూ.. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయనీ, మెరుపులు వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 10, 11 తేదీలలో తీరప్రాంత కర్ణాటకలో మెరుపులు సంభవించవచ్చని IMD చెప్పింది. అలాగే.. వచ్చే 7 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయనీ… మే 8న దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.



