Last Updated:
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు చివరికి ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థులు తడాఖా చూపించారు.
JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ ఫలితాల ఉత్కంఠకు సోమవారం తెరపడింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు చివరికి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం ఫైనల్ కీని ఎన్‌టీఏ విడుదల చేసింది. ఆ వెంటనే సాయంత్రానికి కల్లా ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈ జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
ఈసారి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా 12 మందికి మాత్రమే 100 పర్సంటైల్ స్కోరు సాధించి అదరగొట్టారు. అందులో ముగ్గురు తెలుగు వారు ఉన్నారు. ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్, తెలంగాణ నుంచి వివాన్ శరద్ మహిశ్వరి అద్భుతంగా రాణించి 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థుల్లో పసల మోహిత్ కడప జిల్లాకు చెందిన విద్యార్థి. నరేంద్ర బాబు గారి మహిత్ తిరుపతిలోని ఓ ప్రముఖ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ శ్రీచైతన్య క్యాంపస్‌లో చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 300కి 300 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఈ మార్కులు సాధించడంతో రెండో విడత పరీక్ష తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో ఉత్తమ ర్యాంకు సాధిస్తాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పసల మోహిత్, నరేంద్రబాబుగారి మహిత్
ఇప్పుడు ఒకసారి జేఈఈ మెయిన్ ఫలితాలను పరిశీలిస్తే 100 పర్సంటైల్ స్కోరు సాధించిన వారిలో శ్రేయస్ మిశ్రా(దిల్లీ) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నరేంద్రబాబు గారి మహిత్(ఏపీ), శుభమ్ కుమార్(బిహార్), కబీర్ చిల్లార్(రాజస్థాన్), చిరంజీబ్ కర్(రాజస్థాన్), భవేశ్ పాత్రా(ఒడిశా) ఆ తర్వాత క్రమంలో ఉన్నారు. అలాగే అనయ్ జైన్(హరియాణా), అర్నవ్ గౌతమ్(రాజస్థాన్), పసల మోహిత్(ఏపీ), మాధవ్ వైరాదియా(మహారాష్ట్ర), పురోహిత్ నిమయ్(గుజరాత్), వివాన్ శరద్ మహిశ్వరి(తెలంగాణ) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
వీరిలో పసల మోహిత్, వివాన్ శరద్ మహిశ్వరి 100 పర్సంటైల్ స్కోరుతో జనరల్ కేటగిరీలో టాపర్లుగా నిలవడం విశేషం. అలాగే నరేంద్ర బాబు గారి మహిత్ ఓబీసీ(ఎన్‌సీఎల్) కేటగిరీలో టాపర్‌గా నిలిచారు. ఇంకోవైపు, మరో 68 మంది స్కోరును ఎన్‌టీఏ ప్రకటించలేదు. ఇందుకు గల కారణాన్ని ఎన్‌టీఏ తెలిపింది. గుర్తింపు ధ్రువీకరణ తదితర అంశాల్లో అక్రమ పద్ధతులకు పాల్పడినందుకు వీరి ఫలితాలు వెల్లడించలేదని స్పష్టం చేసింది. ఇంకోవైపు జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను తర్వాత విడుదల చేస్తామని చెప్పింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అయిన ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ ప్రవేశాలు జరిగాయి. ఇందుకు జనవరి 21-28 తేదీల మధ్య జేఈఈ మెయిన్-2026 తొలి విడత పేపర్-1 పరీక్షలు జరగ్గా.. ఇందులో మొత్తం 13.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 13.04 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.
సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీని కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూశారు. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీని విడుదల చేసింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికే జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న అన్నారు. అలాగే ఫైనల్ కీ, ఫలితాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



