గ్రామ సమస్యల మీద నిర్లక్ష్యం తగదు


విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న విమర్శించారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయాయన్నారు. తక్షణమే సీసీ రోడ్లు లేని కాలనీల్లో సీసీ రోడ్లు వేయించాలన్నారు. ఇంటి పన్నులు వసూలు చేసి ప్రజలకు రసీదు ఇవ్వాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షులు షేక్ హజరత్ బాషా, సిపిఐ నాయకులు డోలు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *