ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేసిన ట్రంప్


ఇరాన్‌తో చర్చల్లో పురోగతి సాధించామని, పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై విధించిన దిగ్బంధనం మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించాం. పాకిస్థాన్, ఇతర దేశాల అభ్యర్థన మేరకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కింద నౌకల కదలికలను కొంతకాలం నిలిపివేయాలని నిర్ణయించాం. ఒప్పందం ఖరారవుతుందో లేదో చూసేందుకే ఈ విరామం అని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్, ఇటీవలి సైనిక చర్యల్లో ఇరాన్ నావికా, వైమానిక దళాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. వారి సైనిక శక్తిని సర్వనాశనం చేశామని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, అందుకే ఇరాన్ ఒప్పందం కోసం ముందుకు వస్తోందని ఆయన అన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా స్పష్టం చేశారు. ఇరాన్‌తో చర్చల ఫలితం వెలువడేంత వరకు ఈ తాత్కాలిక విరామం కొనసాగనుంది.

The post ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేసిన ట్రంప్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *