విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి మరో ముగ్గురు జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అన్ని రాష్ట్రాలకు న్యాయమÖర్తులను సిఫారసు చేసే ప్రక్రియలో భాగంగా సమావేశమైన కొలీజియం… ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ న్యాయస్థానాల్లో న్యాయాధికారులుగా పనిచేస్తున్న ముగ్గురు అధికారులను న్యాయమÖర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. న్యాయమÖర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, సీహెచ్ పురుషోత్తమ కుమార్‌ను నియమించాలని కొలీజియం నిర్ణయించింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరి నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
The post హైకోర్టుకు మరో ముగ్గురు జడ్జిలు appeared first on Visalaandhra.


