Srikalahasti | మొన్న శ్రీశైలం..నేడు శ్రీకాళహస్తి | శివభక్తులపై ఎందుకు మీకు ఇంత కోపం?



మొన్న శ్రీశైలంలో శివస్వాములపై లాఠీఛార్జ్, నేడు శ్రీకాళహస్తిలో భక్తులపై భౌతిక దాడులు.. అసలు శివభక్తులపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకింత కోపం అంటూ బాధితులు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మొదటి గేటు వద్ద సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. సమయానికి క్యూలైన్లు కదపకపోవడం, నీరు వంటి కనీస వసతులు లేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు భక్తులపై విరుచుకుపడ్డారని, పలువురు కిందపడిపోయినా కనికరం చూపలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శైవక్షేత్రాల్లో భక్తుల భద్రతను బాబు సర్కారు గాలికొదిలేసిందని, ఆలయ నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *