Today Top 10 News: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన బీజేపీ.. విజయ్ ప్రభంజనం | తెలంగాణ వార్తలు


నటుడు, టీవీకే అధినేత విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తానే ‘సూపర్ హిట్’ అని నిరూపించుకున్నారు.

2. బెంగాల్ విజయంపై మోదీ

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల ఫలితాలు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు. అస్సాంలో ఎన్డీయేను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడులో గెలిచిన విజయ్‌కు అభినందనలు చెబుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.

3. తమిళనాడులో స్టాలిన్ ఓటమి

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఊహించని షాక్ తగిలింది. కొళత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే దూసుకుపోయింది. స్టాలిన్ 1996 తర్వాత ఓడిపోవడం ఇదే మొదటిసారి.

4. దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన బీజేపీ

బెంగాల్‌లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బీజేపీ చెక్ పెట్టింది. అమిత్ షా పక్కా వ్యూహంతో తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టింది. గత రెండు ఎన్నికల్లో సాధ్యం కాని విజయాన్ని ఈసారి బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ఓటమి దీదీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

5. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్

అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నా హిమంత బిశ్వ శర్మ వ్యూహాలు పక్కాగా పనిచేశాయి. తన రాజకీయ ఎత్తుగడలతో ఆయన బీజేపీని భారీ మెజారిటీ వైపు నడిపించారు. కమలదళం హవా అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.

6. విజయ్ విజయంపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

ఎన్నికల ఫలితాలు ఓటర్ల చైతన్యానికి నిదర్శనమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు పాలన నచ్చకపోతే ఎంతటి వారినైనా ఓడిస్తారని ఆయన పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన విజయ్‌ని అభినందించారు. బెంగాల్, అస్సాంలలో బీజేపీ నేతల కృషి అద్భుతమని కొనియాడారు.

7. తెలంగాణలోనూ బీజేపీదే అధికారం

దేశవ్యాప్త ఫలితాల ప్రభావం తెలంగాణపై ఖచ్చితంగా ఉంటుందని బీజేపీ నేత రామచందర్‌రావు అన్నారు. బెంగాల్ విజయం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక సంకేతమని చెప్పారు. ఇండియా కూటమిని ప్రజలు తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలనకే ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు.

8. విజయ్ ఇంటికి నటి త్రిష

తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడంతో ఆయన ఇంటి దగ్గర సంబరాలు మొదలయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన నటి త్రిష.. దర్శనం తర్వాత నేరుగా విజయ్ ఇంటికి వెళ్లారు. అభిమానులు భారీగా తరలిరావడంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకల వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

9. హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌

హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న విదేశీ నౌకల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటించారు. ఉద్రిక్తతల మధ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే దీని లక్ష్యం. యుద్ధంతో సంబంధం లేని దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియాలో శాంతి కోసం అమెరికా సాయం చేస్తుందని ట్రంప్ తెలిపారు.

10. త్రిషకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

నటి త్రిష పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరలక్ష్మి శరత్‌కుమార్‌, మంచు లక్ష్మి వంటి సెలబ్రిటీలు ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. త్రిష లైఫ్‌లో ఇది బెస్ట్ బర్త్‌డే అని వరలక్ష్మి పోస్ట్ పెట్టారు. యూనివర్స్ నీకు గొప్ప గిఫ్ట్ ఇచ్చిందంటూ మంచు లక్ష్మి సరదాగా కామెంట్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *