మొదటి రౌండ్ లెక్కింపు పూర్తి
బెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఆదిక్యంలో కొనసాగుతున్నాయి
ముగ్గురు సీఎంలు వెనుకంజలోనే…
ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుకుంటున్నాయి. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన సమయానికి…తమిళనాడులో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ముందంజలో ఉంది. 234 సీట్లకు గానూ… టీవీకే 100 సీట్లపైన ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు గానూ ఒక అసెంబ్లీ స్థానానికి రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ లెక్కింపు జరుగుతోన్న 293 స్థానాలకు గానూ…బీజేపీ 174 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార టీఎంసీ 110 స్థానాలతో వెనుకబడి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కేరళంలో 140 స్థానాలకు గానూ…యూడీఎఫ్ 91 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార ఎల్‌డీఎప44 స్థానాల్లో మెజార్టీతో కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ప్రభావం కనబరుస్తోంది. అసోంలో ఉన్న 126 స్థానాలకు గానూ… 95 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 27 స్థానాల్లోనే ముందుకు సాగుతోంది. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గానూ…16 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ముగ్గురు సీఎంలు వెనుకంజలోనే…
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముగ్గురు సీఎంలు వెనుకంజలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (భవానీపూర్), తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (కొళత్తూరు), కేరళ సీఎం పినరయి విజయన్ (ధర్మదం) వెనుకంజలో కొనసాగుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మూడో స్థానానికి పడిపోయింది. సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ వెనుకంజలో కొనసాగుతున్నారు.
The post తమిళనాడులో ‘టీవీకే’ హవా appeared first on Visalaandhra.


