15న ప్రేక్షకుల ముందుకు ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’


సినిమా: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీశ్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఈ సినిమాను 15న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ ముత్యాల రామదాస్ డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలిపారు. అంతేకాదు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉందని, ప్రేక్షకులను ఆకర్షించేలా ఈ ప్రేమకథను దర్శకుడు డిజైన్ చేశారని అన్నారు. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించబోతున్నారని, ఈ హృద్యమైన కుటుంబ కథా చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నెల్లూరు సుదర్శన్, హర్ష చెముడు, గుండు సుదర్శన్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *