మే నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే మెరుపులు వస్తాయి, పిడుగులు కూడా పడతాయి అని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ 4 రోజులూ గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని IMD చెప్పింది. ఐతే.. ఈ వర్షాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో కూడా పడతాయని IMD అంచనా వేసింది. IMD చెప్పిన బులిటెన్‌లో ఒక షాకింగ్ విషయం ఉంది. మే 3న కోస్తాంధ్ర, యానాంలో పిడుగులతో వర్షాలు పడతాయి. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లుగా ఉంటుంది. సుడి గాలులు, పెను గాలుల వేగం గంటకు 70 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో మే 5, 6 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని IMD ప్రత్యేకంగా చెప్పింది.



