హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు 86 శాతముతో విజయ దుందుభి మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. వారు మాట్లాడుతూ పాఠశాల ద్వారా 183 మంది పరీక్షలు రాయగా అందులో 155 మంది ఉత్తీర్ణులు అవుతూ 86 శాతము నమోదు కావడం జరిగిందని తెలిపారు. 590 మార్కులతో వై భవ్యశ్రీ, 583 మార్కులతో బండారి అక్షయ, 581 మార్కులతో నిశ్చల్, రంగం సంగీత కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. మూడవ స్థానంలో బీరే జాహ్నవి 581 మార్కులతో కైవసం చేసుకున్నారని, అదేవిధంగా 500 మార్కులకు పైగా 71 మంది విద్యార్థులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పాఠశాల కమిటీ చైర్మన్ బాబావలి, ఉపాధ్యాయ బృందం ఉత్తీర్ణులైన విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేశారు.


