Last Updated:
VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులు అయ్యారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు చెందారు.
JD Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ ఐపీఎస్ అధికారి వి వి లక్ష్మీనారాయణ కొత్త బాధ్యతలు స్వీకరించారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్‌కు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా సేవలందించిన కాలం నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ప్రజల్లో ప్రసిద్ధి పొందారు. 1990 మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా సేవలు ప్రారంభించి విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో గుర్తింపు సంపాదించారు. పలు కీలక దర్యాప్తులతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. విద్యార్థి దశలో వరంగల్ ఎన్ ఐ టీ లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం ఐఐటీ మద్రాస్ లో ఎంటెక్ చదివారు.
మేఘా గ్రూప్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అనుబంధ సంస్థే ఈవీ ట్రాన్స్. ఈ సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ విధానంలో వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న విద్యుత్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. అలాగే బస్సుల నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం 900కు పైగా విద్యుత్ బస్సులను నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు సేవలు అందిస్తోంది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కేసు దర్యాప్తుతో ఆయన పేరు జేడీగా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఉద్యోగానికి మధ్యలోనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించారు. అప్పుడు 2019 జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ లోక్‌సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు. అయినా కలిసి రాలేదు. దీంతో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పారనే భావన కలుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని లక్ష్మీనారాయణ ఎంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



