వైయస్సార్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్
విశాలాంధ్ర- నందికొట్కూరు : వివిధ కార్మిక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వైయస్సార్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ఆటో కార్మికులతో ర్యాలీ తో పటేల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించి ప్రపంచ కార్మికుల హక్కులను కాలవాస్తున్నటువంటి ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి అంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు యాట ఓబులేసు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ మన్సూర్ అహ్మద్, జడ్పిటిసి సోముల సుధాకర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర పంచాయితీ విభాగం ప్రధాన కార్యదర్శి పుల్యాల నాగిరెడ్డి, వైసిపి మైనారిటీ నాయకులు జబ్బార్, చింతా విజ్జి,రైతు సంగం బాబు,ఉపేంద్ర, మాదురి,నాగార్జున రెడ్డి,మదురెడ్డి,చరణ్,కేశవ,లడ్డు,మహేష్,బాండ్ శ్రీను,ల్యాబ్ రవి,అబ్దుల్లా వైసిపి నాయకులు పాల్గొన్నారు.


